స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -673 లోకి అడుగు పెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. వసుధార గురించి రిషి ఆలోచిస్తుంటాడు. "అన్ని జ్ఞాపకాలు ఇచ్చావ్.. అంతా నువ్వే అన్నావ్.. ఇలాంటి రోజు మన మధ్య వస్తుందనుకోలేదు. మనిద్దరం వేరు వేరు కాదు అన్నావ్.. నేను ఎందుకు బాధపడాలి" అని వసుధార గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అయ్యాడు రిషి.
జగతి, మహేంద్రలు చక్రపాణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి దేవయాని వచ్చి "చక్రపాణి, వసుధార మన ఇంటికి వచ్చారా? ఆ విషయం నాకు చెప్పలేదు" అని అంటుంది. "చాటుగా వినే బుద్ది ఇంకా మానుకోలేదా అక్కయ్యా" అని జగతి అంటుంది. "వాళ్ళ వల్లే కదా రిషికి ఈ పరిస్థితి వచ్చింది. అయినా మీరు రిషిని పట్టించుకుంటున్నారా? వసుధార పెళ్లి చేసుకుంది.. నువ్వు ఇంటికి వచ్చేసావ్.. ఇంకేంటి ఎంతసేపు నువ్వు మహేంద్ర పక్కనే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, కాలేజీ వెళ్లినా అనంతగిరి వెళ్లినా మీరిద్దరే కదా... అసలు రిషి గురించి బాధ్యత ఉందా? సాక్షిని పెళ్లి చేసుకోకుండా ఆపేసారు. వసుధారని ఎర వేసారు. రిషి బయట ఎక్కడో ఉంటే మీరు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మీ వల్లే కదూ... " మొత్తం మేమే బాధ్యులం అన్నట్టు మాట్లాడుతున్నారు" అని జగతి సమాధనమిస్తుంది. "మీరే బాధ్యులు" అని దేవయాని అంటుంది. "రిషిని తీసుకురావడం మీ వల్ల అయ్యేపని కాదు... నేను వెళ్ళి తీసుకొస్తాను" అంటూ దేవయాని వెళ్తుంది.
వసుధారకు కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్ లో చక్రపాణి, వసుధార అన్నం తింటూ ఉంటారు. అంతలో అక్కడికి దేవయాని వస్తుంది. రిషి ఎక్కడ అని అరుస్తూ ఉండగా.. రిషి సర్ ఇక్కడికి ఎందుకు వస్తాడు మేడం అని వసుధార చెప్తుంది. దాంతో దేవయానికి కోపం పెరిగిపోతుంది. మా రిషిని వదిలి వెళ్ళిపో నీకు డబ్బు ఎంత కావాలన్నా ఇస్తా అని ఆఫర్ ఇస్తుంది. అప్పుడే మహేంద్రకి ఫోన్ చేసి దేవయాని వచ్చినట్టుగా చెప్తుంది. "సర్... దేవయాని గారు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు" అని వసుధార అంటుంది. అయితే అవతలి వైపు మహేంద్ర కాకుండా ఫోన్ రిషి లిఫ్ట్ చేస్తాడు. "పెద్దమ్మ అక్కడికెందుకు వెళ్ళింది" అని ఆవేశంగా రిషి అక్కడికి బయల్దేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..